Neem Nimboli Benefits: వేప కాయలతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా?

| Edited By: Ravi Kiran

Oct 30, 2023 | 8:30 AM

వేప చెట్టుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. పూర్వం నుంచి ఈ చెట్టుతో అనేక వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు, ఇన్ ఫెక్షన్ లకు చెక్ పెడుతూ వచ్చేవారు. ఇప్పుడంటే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. పాత కాలంలో అయితే ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా వేప చెట్టుతోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు. ఆయుర్వేదంలో కూడా వేప చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిలో ఉండే ఔషధాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా..

Neem Nimboli Benefits: వేప కాయలతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా?
Neem Nimboli
Follow us on

వేప చెట్టుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. పూర్వం నుంచి ఈ చెట్టుతో అనేక వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు, ఇన్ ఫెక్షన్ లకు చెక్ పెడుతూ వచ్చేవారు. ఇప్పుడంటే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. పాత కాలంలో అయితే ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా వేప చెట్టుతోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు. ఆయుర్వేదంలో కూడా వేప చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిలో ఉండే ఔషధాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే కేవలం వేప చెట్టు కాయలతోనే కాకుండా.. వేప కాయలోని కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కవే. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వేప కాయల్లోని ఉండే పోషకాలు:

వేప కాయల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎన్నో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని వ్యాధులు రాకుండా కాపాడుతుంది:

వేప కాయలు చర్మ రక్షణకు ఎంతో సహకరిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఇ వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు, ముడతలు రాకుండా కాపాడుతుంది. విటమిన్ ఇ కారణంగా చర్మం మృదువుగా, పొడి బారిపోకుండా ఉంటాయి. అలాగే స్కిన్ ని గ్లోగా ఉంచడంలో వేప కాయలు బాగా హెల్ప్ అవుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

వేప కాయల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లు, ఇన్ ఫెక్షన్లు వంటికి రాకుండా పోరాడుతుంది. అంతే కాకుండా రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు సంఖ్యను పెంచుతుంది. అలాగే వేప కాయలను ఆహారంతో పాటు తీసుకుంటే.. బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

నోటి అల్సర్లు రాకుండా నివారిస్తుంది:

వేప కాయల్లో ఉండే యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ లక్షణాలు.. నోటి పూతకి కారణం అయ్యే వైరస్, బ్యాక్టీరియా రాకుండా చూస్తాయి. అలాగే నోటిలో వచ్చే పుండు, వాపును తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు.. నోటి అల్సర్ లో వచ్చే వాపు, నొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగ పడతాయి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.