హర్యానా గద్దెపై మళ్ళీ ‘ మనోహరుడే ‘.. రెండో సారి సీఎంగా ప్రమాణం

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం కావడం ఇది రెండో సారి. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో బాటు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా, అకాలీ దళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత భూపేందర్‌సింగ్  హుడాతో బాటు పలువురు […]

హర్యానా గద్దెపై మళ్ళీ ' మనోహరుడే '.. రెండో సారి సీఎంగా ప్రమాణం
Follow us

|

Updated on: Oct 27, 2019 | 4:32 PM

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం కావడం ఇది రెండో సారి. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో బాటు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా, అకాలీ దళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత భూపేందర్‌సింగ్  హుడాతో బాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో 40 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో డీల్ కుదుర్చుకున్న సంగతి విదితమే.. జేజేపీ 10 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ బలం 57 కి పెరిగింది.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ అన్ని –10 పార్లమెంటరీ సీట్లనూ గెలుచుకుంది. ఈసారి శాసన సభ ఎన్నికల్లో 75 సీట్లు వస్తాయని ఆశించినా 40 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ పార్టీకి చెందిన పది మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓడిపోయారు. కాగా-టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ దోషిగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అజయ్ చౌతాలా (దుష్యంత్ చౌతాలా తండ్రి) ఆదివారం జైలు నుంచి రెండు వా రాల పెరోల్ పై విడుదలయ్యారు. తన కుమారుడు కేవలం 11 నెలల్లోనే తన పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తెచ్చాడో తెలుస్తోందని ఆయన గర్వంగా వ్యాఖ్యానించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..