Manchu Vishnu Tweet: మహేష్‌ బాబు అందానికి కారణమేంటో చెప్పిన మంచు విష్ణు.. ప్రిన్స్‌ యువకుడిలా మారుతోంది అందుకేనంటూ..

|

Jan 17, 2021 | 5:39 AM

Manchu Vishnu About Mahesh Babu: కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఒకరు. చిత్ర సీమలో అత్యంత వివాదరహితుల్లో ఒకరైన మహేష్..

Manchu Vishnu Tweet: మహేష్‌ బాబు అందానికి కారణమేంటో చెప్పిన మంచు విష్ణు.. ప్రిన్స్‌ యువకుడిలా మారుతోంది అందుకేనంటూ..
Follow us on

Manchu Vishnu About Mahesh Babu: కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఒకరు. చిత్ర సీమలో అత్యంత వివాదరహితుల్లో ఒకరైన మహేష్‌ బాబుకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. తోటి తారలతో ఎంతో జోవియల్‌గా ఉండే మహేష్‌ బాబు తాజాగా మంచు విష్ణు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో పాల్గొన్నాడు.
మంచు విష్ణు సతీమణి విరొనికా పుట్టినరోజు వేడుకల్లో మహేష్‌ తన భార్య నమ్రతాతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విష్ణు, విరొనికా, మహేష్‌, నమ్రత ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్న విష్ణు ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించాడు. విష్ణు ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ ఫొటోలో ఉన్న ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే దానికి ప్రధాన కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌పై మహేష్‌ స్పందిస్తూ.. ‘ఇంతమంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వేడుకల్లో పలు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Also Read: RGV: చాలా రోజుల తర్వాత వర్మ ఎమోషనల్ స్టేట్‌మెంట్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తారట..