రకుల్ సీరియస్ పోస్ట్‌కు ఫన్నీగా కామెంట్ చేసిన మంచు లక్ష్మీ.. ఇంతకీ ఏమని కామెంట్ చేసిందంటే.

కరోనా అన్‌లాక్ తర్వాత తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘

రకుల్ సీరియస్ పోస్ట్‌కు ఫన్నీగా కామెంట్ చేసిన మంచు లక్ష్మీ.. ఇంతకీ ఏమని కామెంట్ చేసిందంటే.

Updated on: Dec 22, 2020 | 7:48 PM

Manchu laxmi funny reply to rakul post: కరోనా అన్‌లాక్ తర్వాత తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. దయచేసి నన్ను కలిసినవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’ రకుల్ ట్వీట్ చేశారు.


అయితే తాజాగా ఈ ట్వీట్‌పై స్పందించిన నటి, నిర్మాత లక్ష్మీ మంచు కాస్త ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. రకుల్ సూచించినట్లుగానే కరోనా పరీక్ష చేయించుకున్న లక్ష్మీ కామెంట్ చేస్తూ.. ‘నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. ఈ ఏడాదికి మోస్ట్ నెగిటివ్ పర్సన్ నేనే’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఇలా రకుల్ చెప్పిన సీరియస్ విషయాన్ని కూడా లక్ష్మీ ఫన్నీగా మార్చేసిందన్నమాట. ఇదిలా ఉంటే రకుల్, లక్ష్మీ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.