ఎకరం భూమి కోసం తల్లిని నరికి చంపిన తనయుడు
రానురాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తిపాస్తులు నిండిప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓ కొడుకు ఆస్తికోసం కన్నతల్లిని కరష్కంగా గొడ్డలితో నరికి చంపాడు.
రానురాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తిపాస్తులు నిండిప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓ కొడుకు ఆస్తికోసం కన్నతల్లిని కరష్కంగా గొడ్డలితో నరికి చంపాడు. తనకు కాకుండా సోదరుడి కుమారుడికి భూమి కట్టబెట్టేందుకు యత్నిస్తోందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన కొండేటి తిరుపతమ్మ (80)కి ఇద్దరు కుమారులు. తిరుపతమ్మ పేర ఎకరం భూమి ఉంది. ఆమె ఆలనా పాలన చూసుకోవడంలో చిన్నకొడుకు కొండేటి ఏడుకొండలు కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తల్లి బాగోగులు చూడడటమే మానేశాడు. దీంతో తిరుపతమ్మ కొంతకాలంగా మనవడి వద్ద ఉంటోంది. అయితే తల్లి తన పేర ఉన్న ఎకరం భూమి అన్నకొడుకుకే ఇచ్చేస్తుందన్న అనుమానంతో ఏడుకొండలు తల్లిపై పగ పెంచుకున్నాడు. శనివారం మద్యం మత్తులో తల్లి ఉంటున్న ఇంటికి వచ్చి గొడ్డలితో నరికేశాడు. తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఏడుకొండలు పారిపోయాడు. కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.