Man Kills Friend:  భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం

|

Jan 05, 2021 | 9:23 AM

మానవ సంబంధాలు మరీ దారుణంగా పతనమవుతున్నాయి. ఆనందాలు, ఆప్యాయతలు పోయి.. వాటి స్థానంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు...

Man Kills Friend:  భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం
Follow us on

Man Kills Friend : మానవ సంబంధాలు మరీ దారుణంగా పతనమవుతున్నాయి. ఆనందాలు, ఆప్యాయతలు పోయి.. వాటి స్థానంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయి..అవి హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాయని భర్తనే హత్య చేయించింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే..అనంతపురం జిల్లా  గుత్తిఆర్‌.ఎస్‌.లోని తోళ్లషాపులో అశోక్, యోగి అనే వ్యక్తులు నివశిస్తున్నారు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. పెయింట్ వృత్తి కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో అశోక్ ఇంటికి యోగి తరుచుగా వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో యోగికి అశోక్‌ భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో భార్యను పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు అశోక్.

దీంతో తమ సంబంధానికి భర్త అశోక్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య వెంకటలక్ష్మి అతడిని హతమార్చాలని ప్రియుడిని కోరింది. దీంతో యోగీ స్నేహితుడి హత్యకు పక్కా ప్లాన్ వేశాడు. మందు పార్టీ చేసుకుందామంటూ అశోక్‌ను స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఫుల్లుగా మద్యం తాగారు. మద్యం మత్తులో అశోక్‌ను కత్తితో పొడిచి చంపాడు యోగి ఆదివారం హత్య జరగగా.. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సీఐ రాము, ఎస్‌ఐ గోపాలుడు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుడి తల్లి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య కుదిరిన సయోధ్య.. బల్లవల నిషేధానికి ఇరువర్గాల అంగీకారం