AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYD Rare Record: మరో అరుదైన ఘనత సాధించిన మహా నగరం.. ఆ విషయంలో హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో స్థానం..

CC Cameras In HYD: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు...

HYD Rare Record: మరో అరుదైన ఘనత సాధించిన మహా నగరం.. ఆ విషయంలో హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో స్థానం..
Robbery
Narender Vaitla
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 05, 2021 | 9:43 AM

Share

CC Cameras In HYD: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను నివాసయోగ్యానికి అనువైన పట్టణంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో విషయంలోనూ భాగ్యనగరం టాప్‌ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే సీసీ కెమెరాలు ఎక్కువ వినియోగిస్తున్న పట్టణాల్లో హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడు రాజధాని చెన్నై మొదటి స్థానంలో నిలవడం విశేషం. చెన్నైలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కు 657 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే.. చదరపు కిలోమీటర్‌కు 480 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం నేర పరిశోధనల్లో సీసీ కెమెరాల పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సగం వరకు కేసులు సీసీ కెమెరాల ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతోపాటు, ప్రభుత్వాలు కూడా సీసీ కెమెరాల వినియోగాన్ని బాగా పెంచాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘన, నేరస్థులను పట్టుకోవడం వంటి వాటి కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది.

Also Read: గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిథిలో కొత్తగా 57 థీమ్ పార్కులు.. ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచఎంసీ..