వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య కుదిరిన సయోధ్య.. బల్లవల నిషేధానికి ఇరువర్గాల అంగీకారం

గత నెల 12న ప్రకాశంజిల్లా వాడరేవు - కఠారివారిపాలెం మధ్య చెలరేగిన వివాదం.. తీవ్రస్థాయికి చేరింది. రెండు గ్రామాల మత్స్యకారులు ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. ఈ దాడులు తెలుగు రాష్ట్రాల్లో...

వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య కుదిరిన సయోధ్య.. బల్లవల నిషేధానికి ఇరువర్గాల అంగీకారం
Follow us

|

Updated on: Jan 05, 2021 | 8:46 AM

గత నెల 12న ప్రకాశంజిల్లా వాడరేవు – కఠారివారిపాలెం మధ్య చెలరేగిన వివాదం.. తీవ్రస్థాయికి చేరింది. రెండు గ్రామాల మత్స్యకారులు ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. ఈ దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఓ వైపు వలల యుద్ధం.. మరోవైపు రాజకీయ నేతల పరామర్శల తర్వాత చెలరేగిన టెన్షన్‌ వాతావరణంతో.. కఠానిపాలెం, వాడరేవు అట్టుడికిపోయాయి. ఈ వరుస సంఘటనలపై పోలీసులు ఇరువర్గాలకు చెందిన 28 మంది మత్స్యకారును అరెస్ట్‌ చేసి పదిరోజుల క్రితం జైలుకు పంపించారు. అయితే వీరికి తాజాగా బెయిల్‌ మంజూరు కావడంతో విడుదలయ్యారు. దీంతో ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులను ఒంగోలుకు పిలిపించిన అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపి మత్స్యశాఖ మంత్రి అప్పల్రాజు, జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనువాసులురెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్‌ పోలా భాస్కర్‌లు హాజరయ్యారు. వీరితో పాటు మత్స్యశాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు హాజరయ్యారు.

వాడరేవు మత్స్యకారులకు కఠారివారిపాలెం మత్స్యకారులు సారీ చెప్పారు. వారు కూడా క్షమించేశామని ప్రకటించారు. దీంతో మంత్రులు, అధికారులు ఇరుగ్రామాల మత్స్యకారులను అభినందించారు. బల్లవల ట్రాకింగ్‌ వల అయినందువల్ల దానిని నిషేధించేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు మంత్రి అప్పల్రాజు. ఒకవేళ ఉపయోగించదలిస్తే సముద్రంలో 8 కిలోమీటర్ల అవతల ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఐలవలలో కన్నుసైజు తగ్గిస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు.

Also Read : Petrol-Diesel Price Today: పెట్రోల్, డీజిల్ రేట్లు అలానే… హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే…