మనసు పడ్డ అమ్మాయిపై.. డిటెక్టివ్ నిఘా..
ఇంటర్ చదివే అమ్మాయిపై మనసు పడ్డ ఓ ప్రబుద్ధుడు.. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన మహేష్ కుమార్ (23) సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. స్కౌట్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అనే సంస్థకు రూ.17 వేల రూపాయలు ఇచ్చి.. అమ్మాయి ప్రవర్తన గురించి కనుక్కోవాలని కోరాడు. ఈ సంఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటుచేసుకుంది. ఎటువంటి అనుమతులు లేని ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఇంటర్ చదివే మైనర్ […]

ఇంటర్ చదివే అమ్మాయిపై మనసు పడ్డ ఓ ప్రబుద్ధుడు.. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన మహేష్ కుమార్ (23) సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. స్కౌట్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అనే సంస్థకు రూ.17 వేల రూపాయలు ఇచ్చి.. అమ్మాయి ప్రవర్తన గురించి కనుక్కోవాలని కోరాడు. ఈ సంఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటుచేసుకుంది.
ఎటువంటి అనుమతులు లేని ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఇంటర్ చదివే మైనర్ బాలిక కదలికలపై నిఘా పెట్టారు. ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు తోటి విద్యార్థిని స్నేహితులను వివరాలు అడగటంతో కాలేజీ యాజమాన్యం విషయాన్ని బాలిక పేరెంట్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరి వద్ద నుండి లాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు, వాళ్లు సేకరించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాలికకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు కూడా సేకరించినట్టు సమాచారం.



