Viral video : కొందరు వ్యక్తులు.. లైకులు, కామెంట్స్ కోసం రోడ్లపై.. చేసే హంగామా మాములుగా ఉండదు. కార్లు, బైక్స్ స్టంట్స్ చేస్తూ.. బీభత్సం సృష్టిస్తుంటారు. కొన్నికొన్నిసార్లు అయితే.. వీరి ఓవర్ కాన్ఫిడెన్స్‌కు.. అభంశుభం తెలియన వారు కూడా బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా.. ఇలాంటి ఓ స్టంట్ చేసిన ఓ వ్యక్తికి.. వినూత్నంగా షాక్ ఇచ్చారు యూపీ పోలీసులు.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి కూడా కదులుతున్న కారుపైకి ఎక్కి పుషప్స్ చేశాడు. ఈ సోషల్ మీడియా మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో.. కూడా బాగానే వైరల్ అయింది. హీరోలా బిల్‌డప్ ఇస్తూ.. కదులుతున్న కారుపైకి ఎక్కి.. పుషప్స్ చేసి.. నానా హంగామా చేశాడు. అయితే.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఈ వీడియో పోలీసుల కంటపడింది. ఇంకేముందు.. అమ్ముడు లెట్స్ కుమ్ముడు అంటూ ఓ సాంగ్ వేసుకుని.. ఆ పుషప్స్ వీడియోతో పాటు.. రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు పోలీసులు. చాలా కష్టపడినట్లున్నావు అబ్బాయ్.. ఇదిగో నీకోసం ఈ రివార్డు అంటూ రూ.7500 చలాన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ వీడియోను తమ ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది. యూపీ పోలీసులు సెటైరిక్‌గా ఇచ్చిన ఈ వార్నింగ్ నెటిజన్లు విపరీతంగా నచ్చేసింది. దీంతో పోలీసులను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. చలాన్ తర్వాత ఓ వీడియోలో తాను చేసింది తప్పే అని ఉజ్వల్ అనే ఆ వ్యక్తి చెప్పడం విశేషం.
Some Pushups will only bring you down in the eyes of Law !
Stay Strong, Stay Safe !#UPPCares #UPPolice pic.twitter.com/dvGSjtL2Az
— UP POLICE (@Uppolice) March 13, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
ఈ ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. ఒక్క వీడియోతో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.. సెలబ్రిటీ అయిపోయాడు..