జస్ట్ ఫన్ కోసం.. రూ.23 కోట్ల చేపను వదిలేశారు..!

| Edited By:

Sep 29, 2019 | 12:08 PM

ఐర్లాండ్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్స్ తన టీంతో కలిసి సరదా కోసం చేపలు పట్టడానికి వెళ్లాడు. అయితే వారు వేసిన వలలో 8.5 అడుగులున్న ట్యూనా చేప చిక్కింది. దీన్ని జపాన్ మార్కెట్ లో అమ్మితే రూ.23 కోట్లు వస్తాయి. జస్ట్ చేపల్ని పట్టుకుని వదిలేయాలి అనుకున్నవారు దాని పిక్ ఒకటి తీసుకుని మళ్లీ నీటిలోకి వదిలేశారు. చేపలను పట్టడం ద్వారా అట్లాంటిక్‌లో చేపలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయాలనుకున్నారు. అందుకే సరదాగా చేపలను పట్టుకోవడానికి […]

జస్ట్ ఫన్ కోసం.. రూ.23 కోట్ల చేపను వదిలేశారు..!
Follow us on

ఐర్లాండ్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్స్ తన టీంతో కలిసి సరదా కోసం చేపలు పట్టడానికి వెళ్లాడు. అయితే వారు వేసిన వలలో 8.5 అడుగులున్న ట్యూనా చేప చిక్కింది. దీన్ని జపాన్ మార్కెట్ లో అమ్మితే రూ.23 కోట్లు వస్తాయి. జస్ట్ చేపల్ని పట్టుకుని వదిలేయాలి అనుకున్నవారు దాని పిక్ ఒకటి తీసుకుని మళ్లీ నీటిలోకి వదిలేశారు. చేపలను పట్టడం ద్వారా అట్లాంటిక్‌లో చేపలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయాలనుకున్నారు. అందుకే సరదాగా చేపలను పట్టుకోవడానికి వెళ్లారు. అయితే వారు తీసిన పిక్ ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ పోస్టుకి మంచి రెస్సాన్స్ వచ్చింది. అంత ఖరీదైన చేపను వదిలేయడంతో అందరూ ముందుగా ఆశ్చర్యపోయారు.

అయితే ఆ చేపను పట్టిన తర్వాత దాని బరువు ఎంత ఉంటుందో తెలుసుకున్నారు. సుమారు 270 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. దానికి ట్యాగ్ తగిలించి, తిరిగి నీటిలోకి వదిలేశారు. చేపల్ని పట్టుకొని వదిలేసే కార్యక్రమం అక్టోబర్ 15 వరకూ సాగనుంది. ఇందులో మొత్తం 15 బోట్లు పాల్గొంటున్నాయి.