Maoist attack: మావోయిస్టులు రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆపై లేఖను విడిచి వెళ్లారు. వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ నెపంతో వాకపల్లికి చెందిన గెమ్మెలి కృష్ణారావు అనే వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత అతని మృతదేహం వద్ద లేఖను వదిలి వెళ్లారు. సమాచార బట్వడాకు సంబంధించి పలుమార్లు హెచ్చరించినా కృష్ణారావు తన పద్దతిని మార్చుకోలేదని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు. పోలీసులకు, అధికారులకు ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తుండటంతోనే అతన్ని హత్య చేశామని మావోలు అంగీకరించారు. అయితే ఈ లేఖ కోరికొండ పెదబయలు ఏరియా కమిటీ మావోయిస్టుల పేరిట ఉంది. కృష్ణారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇన్ఫార్మర్ నెపంతోనే కృష్ణారావును మావోయిస్టులు హత్య చేసినట్లు ధృవీకరించారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: