బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరాం అన్నవారిపై ఆగ్రహిస్తున్నారని.. ఆమె హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందినవారని అన్నారు.
కృత యుగంలో ఓ రాక్షసుడు ఉండేవాడని.. అతడి పేరు హిరణ్యకశ్యపుడని.. విష్ణుమూర్తిని కొలిచినందుకు తన కుమారుడైన ప్రహ్లాదుడినే జైల్లో బంధించాడని అన్నారు. బెంగాల్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని.. దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ఆ రాక్షసుడి కుటుంబానికి చెందిన వారిలా అనిపిస్తోందని అన్నారు.