‘మహర్షి’ కట్టిన లుంగీ.. మాస్ డాన్స్ ‘మైండ్ బ్లాంక్’ చేస్తుందా.?
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా రిలీజైన ‘మైండ్ బ్లాంక్’ అనే మాస్ బీట్‌లో మహేష్ బాబు లుంగీలో కనిపించడమే కాకుండా ఫుల్ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టనున్నాడని తెలుస్తోంది. ఈ సాంగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో మహేష్ సాంగ్ కోసం స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సూపర్ […]

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా రిలీజైన ‘మైండ్ బ్లాంక్’ అనే మాస్ బీట్‌లో మహేష్ బాబు లుంగీలో కనిపించడమే కాకుండా ఫుల్ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టనున్నాడని తెలుస్తోంది.
ఈ సాంగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో మహేష్ సాంగ్ కోసం స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారు మహేష్‌ను మాస్ అవతారంలో చూస్తే పూనకాలే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, పోకిరి, శ్రీమంతుడు వంటి సినిమాల్లోని సూపర్ స్టార్ లుంగీ డాన్స్‌లోని సీన్స్ ఇందులో కూడా రిపీట్ అవుతాయా లేదా అన్నది చూడాల్సిందే. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.




