Maharashtra Farmers Protest: నేను కూడా రైతునే.. కేంద్ర సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమన్న మహారాష్ట్ర స్పీకర్

కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త సాగు చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయమని మహారాష్ట్ర స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అన్నదాతలు నిరసనలు చేపట్టారు..

Maharashtra Farmers Protest: నేను కూడా రైతునే.. కేంద్ర సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమన్న మహారాష్ట్ర స్పీకర్
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2021 | 1:09 PM

Maharashtra Farmers Protest: కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త సాగు చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయమని మహారాష్ట్ర స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అన్నదాతలు నిరసనలు చేపట్టారు. నాసిక్ జిల్లాలు చెందిన రైతులు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యాక్రమానికి హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం నానా పటోల్ మీడియాతో మాట్లాడారు.

కేంద్రం తెచ్చిన కొత్త సాగు చ‌ట్టాల‌పై రాష్ట్ర ప్రభుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసి స‌మీక్షిస్తుంద‌ని తెలిపారు.తాను కూడా రైతునే కనుక అన్న‌దాత‌ల నిర‌స‌న‌కు త‌ప్ప‌కుండా మ‌ద్ద‌తు తెలిపుతానన్నారు. ముంబైలో అన్నదాత నిరసనకు ఇప్పటికే ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌, మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాల‌సాహెబ్ థోర‌త్ మద్దతు ప్రకటించారు. రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌పై మెమోరాండం ఇచ్చేందుకు స‌మ‌యం కోరితే గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి అనుమతి ఇవ్వలేదంటూ శర‌ద్ ప‌వార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కంగ‌నా ర‌నౌత్‌కు స‌మ‌యం ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్ రైతుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదే అంశాలను ప్ర‌స్తావిస్తూ స్పీకర్ నానా పటోల్ గ‌వ‌ర్న‌ర్ తీరు సరికాదన్నారు.

Also Read: మీ స్నేహితులు, సన్నిహితులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలియజేయండి..!