సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు మహారాష్ట్ర తిరస్కరణ
సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు అనుమతిని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇది బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర వ్యవహారంగా మారింది. ఇక ఏ దర్యాప్తు అయినా చేయాలంటే సీబీఐ....

సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు అనుమతిని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇది బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర వ్యవహారంగా మారింది. ఇక ఏ దర్యాప్తు అయినా చేయాలంటే సీబీఐ…. ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. పఏపీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ తరువాత తాజాగా రాజస్థాన్ రాష్ట్రం కూడా ఈ దర్యాప్తు సంస్థకు ‘కవాటాలు మూసేసింది” యూపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ ఫిర్యాదును పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ కి సంబంధించిన రేటింగ్స్ స్కామ్ పై ఇన్వెస్టిగేషన్ కి సీబీఐ నడుం బిగించిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు ఛానల్స్ వ్యవహారంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును బీజేపీ కోరగా, దాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తమ ముంబై పోలీసుల దర్యాప్తు పట్లే మొగ్గు చూపిన విషయం గమనార్హం.