బంగ్లా ఉమెన్ క్రికెటర్ వెడ్డింగ్ ఫోటోషూట్‌పై నెటిజన్ల ప్రశంసలు
వెడ్డింగ్ అయ్యింది కాబట్టి మస్టుగా ఫోటోషూట్ పెట్టుకోవాల్సిందే అనే ధోరణి ఇప్పుడు ఎక్కువయ్యింది.. కానీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే అల్లాటప్పగా ఉండకూడదు, అందులో ఓ థీమ్ ఉండాలని అనుకునేవారు తక్కువ!

వెడ్డింగ్ అయ్యింది కాబట్టి మస్టుగా ఫోటోషూట్ పెట్టుకోవాల్సిందే అనే ధోరణి ఇప్పుడు ఎక్కువయ్యింది.. కానీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే అల్లాటప్పగా ఉండకూడదు, అందులో ఓ థీమ్ ఉండాలని అనుకునేవారు తక్కువ! బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ కూడా ఇలాగే ఆలోచించారు..బంగ్లాదేశ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు ఎనిమిదేళ్లుగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. క్రికెటర్‌గా మంచి పేరునే గడించారు సంజిదా ఇస్లామ్. ఆమె మొన్న 17న రంగాపూర్‌కు చెందిన ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్ డిక్‌ను పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత ఆమె ఫోటోషూట్‌లో పాల్గొన్నారు.. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. చక్కటి చీరకట్టుతో, ఒంటి నిండా ఆభరణాలతో గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తూ ఫోటోలు దిగింది.. పెళ్లి కూతురు ముస్తాబులోనే బ్యాట్ పట్టుకున్న సంజిదా ఇస్లామ్ కెమెరాకు కవర్ డ్రైవ్, పుల్‌షాట్స్ పోజులిచ్చారు.. ఈ ఫోటోలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కూడా ఆకట్టుకున్నాయి.. క్రికెటర్లు పెళ్లి చేసుకుంటే ఫోటోషూట్‌లు ఇలాగే ఉంటాయి మరి! అంటూ ఈ ఫోటోలను ఐసీసీ రీ ట్వీట్ చేసింది..ఇక నెటిజన్లు సరేసరి! బ్రహ్మాండమంటూ కితాబులిస్తున్నారు.. కొందరే ఏముంది ఇందులో అంటూ ఈసడించుకుంటున్నారు.. అయితే ఈ కామెంట్లను సంజిదా వెల్ లెఫ్ట్ చేస్తోంది.. క్రికెట్‌లో ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్లే బాల్స్‌ను ఎలాగైతే వదిలేస్తారో అలాగే ఈ కామెంట్లను వదిలేస్తున్నది సంజిదా!