మహారాష్ట్రలో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 3,940 మందికి పాజిటివ్, 74 మంది మృతి

|

Dec 19, 2020 | 9:49 PM

తొలి విడత కరోనా వైరస్ వ్యాప్తితో అగ్రస్థానంలో కొనసాగిన మహారాష్ట్ర మరోసారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అంతే స్థాయిలో నిత్యం మరణాలసంఖ్య కూడా పెరుగుతుంది.

మహారాష్ట్రలో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 3,940 మందికి పాజిటివ్, 74 మంది మృతి
Follow us on

తొలి విడత కరోనా వైరస్ వ్యాప్తితో అగ్రస్థానంలో కొనసాగిన మహారాష్ట్ర మరోసారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అంతే స్థాయిలో నిత్యం మరణాలసంఖ్య కూడా పెరుగుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,940 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా, ఈ ఒక్కరోజులో 74 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడింది. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేసింది.

కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,92,707కు చేరుకుంది. ఇక, ఆ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య చూస్తే.. 48,648కు పెరిగింది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 3,119 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,81,841కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 61,095 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, రెండో విడతలోనూ కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఇక, దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.