మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు, బీజేపీపై నిప్పులు కక్కిన మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే

| Edited By: Anil kumar poka

Nov 27, 2020 | 5:33 PM

తమ శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అవినీతికేసు పెట్టి కేంద్రం వేధిస్తోందని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆరోపించారు. బీజేపీకి ఆయన గట్టి వార్నింగ్ ఇస్తూ.. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో,

మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు, బీజేపీపై నిప్పులు కక్కిన మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే
Follow us on

తమ శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అవినీతికేసు పెట్టి కేంద్రం వేధిస్తోందని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆరోపించారు. బీజేపీకి ఆయన గట్టి వార్నింగ్ ఇస్తూ.. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా సెట్ రైట్ చేయాలో తమకు తెలుసునన్నారు. సేనకు చెందిన ప్రతాప్ సర్నాయక్, ఆయన కొడుకు విహంగ్ సర్నాయక్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఇన్వెస్టిగేషన్ కు దిగిన విషయాన్నిథాక్రే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మీరు మాత్రం అవినీతిపరులు కారా ? మీపై అవినీతి కేసులు లేవా అని ప్రశ్నించారు. మీకూ కుటుంబాలు, భార్యా, పిల్లలూ ఉన్నారని, మీరేమీ స్వచ్ఛమైన చరితులు కారని అన్నారు. తమ పార్టీ పత్రిక సామ్నాకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఇలా తమకు ఒకప్పుడు మిత్ర పక్షమైన బీజేపీపై నిప్పులు కక్కారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు బీజేపీ…. దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్నారు. అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్ ని, ఆయన తల్లిని సూసైడ్ కి ప్రోత్సహించారని రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై వఛ్చిన ఆరోపణలపై 2018 లో దాఖలైన కేసును తిరగదోడాలని ప్రతాప్ సర్నాయక్ లోగడ డిమాండ్ చేశారు. దీంతో అర్నాబ్ ను పోలీసులు అరెస్టు చేయడం, జైలుకు పంపగా ఆయన తన అరెస్టును  సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కడం, కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేయడం తెలిసిందే.  (ఈ  బెయిలును కోర్టు శుక్రవారం పొడిగించింది).

ఎవరైనా సూసైడ్ నోట్  రాసి ఆత్మహత్య చేసుకుంటే దానిపై దర్యాప్తు చేసే బాధ్యత మాకు లేదా అని ఉధ్ధవ్ థాక్రే అన్నారు. మేం సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాం.. మీరు రాజకీయాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సహించబోం అని ఆయన  బీజేపీని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కమలం పార్టీపై  థాక్రే ఇలా విరుచుకుపడడం ఇదే మొదటిసారి.