QR code on wedding card: వాటే ఐడియా.. పెళ్లి శుభలేఖపై QR కోడ్.. గిఫ్ట్ మనీని పంపేందుకు వీలుగా.. ఎక్కడంటే..

|

Jan 18, 2021 | 8:44 PM

కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు చాలా మంది శుభకార్యాలకు వెళ్ళాలంటే వణికిపోతున్నారు. అయితే అనుకున్నంత అతిధులు రాకపోవడంతో చేయాల్సిన శుభకార్యాలను కూడా ఘనంగా

QR code on wedding card: వాటే ఐడియా.. పెళ్లి శుభలేఖపై QR కోడ్.. గిఫ్ట్ మనీని పంపేందుకు వీలుగా.. ఎక్కడంటే..
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు చాలా మంది శుభకార్యాలకు వెళ్ళాలంటే వణికిపోతున్నారు. అయితే అనుకున్నంత అతిధులు రాకపోవడంతో చేయాల్సిన శుభకార్యాలను కూడా ఘనంగా చేసుకోలేకపోతున్నారు. ఈ మహామ్మారి వలన పెళ్ళిలకు హాజరయ్యే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇందులో మరీ ముఖ్యంగా పెళ్ళిల్లో చదివింపులు జరిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు ప్రజలు.

ప్రస్తుత కాలంలో ప్రతీది ఆన్‏లైన్‏లోనే జరుగుతున్నాయి. తాజాగా పెళ్ళి చదివింపులు కూడా ఆన్‏లైన్‏లోనే చదివించే పరిస్థితికి వచ్చేసాం. ఇక పెళ్ళి పత్రికపై ఓ జంట ఏకంగా క్యూఆర్ కోడ్‏నే ముంద్రించేశారు. ప్రస్తుతం ఈ శుభలేఖ నెట్టింట్లో వైరల్‏గా మారింది. తమిళనాడులోని మధురైలో ఓ కుటుంబం పెళ్ళి పత్రికను వెరైటీగా ప్రింట్ చేయించింది. తమ కూతురి పెళ్లి కోసం.. శుభలేఖపై క్యూఆర్ కోడ్‏ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‏లను ఆ కార్డుపై ప్రింట్ చేయించారు. పెళ్ళికి వచ్చిన అతిథులు కానీ, కరోనా వల్ల పెళ్ళికి హాజరుకాలేనివారు తమ ఇంట్లో ఉండే ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగించి చదివింపులు చేయ్యొచ్చు. నూతన వధువరులకు గిప్ట్ మనీ ఇవ్వాలనుకునే వారు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బును ట్రాన్స్‏ఫర్ చేయవచ్చు. ఇక ఆదివారం ఈ వివాహం జరగగా.. ఇప్పటి వరకు దాదాపు 30 మంది అతిథులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారట. ఈ శుభలేక చూసిన నెటిజన్లు ఐడియా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

What’s App Privacy Policy: ఆ వార్తలన్ని అవాస్తవం.. మీ డేటా భద్రతకు మేం రక్షణ.. క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

Find a Lost Phone: మీ ఫోన్ పోగోట్టుకున్నారా ? అయితే ఇలా చేస్తే మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు..