లాక్ డౌన్ ఎఫెక్ట్: శానిటైజర్ నుంచి మద్యం తయారీ..

| Edited By:

May 03, 2020 | 5:25 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో మద్యం షాపులు బంద్ ఉండటంతో అక్రమ వ్యాపారులు రెచ్చిపొతున్నారు. ఈ అవకాశాన్ని సోమ్ము చేసుకునేందుకు

లాక్ డౌన్ ఎఫెక్ట్: శానిటైజర్ నుంచి మద్యం తయారీ..
Follow us on

Liquor From Sanitizer: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో మద్యం షాపులు బంద్ ఉండటంతో అక్రమ వ్యాపారులు రెచ్చిపొతున్నారు. ఈ అవకాశాన్ని సోమ్ము చేసుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాకు చెందిన ఇందల్ సింగ్ రాజపుత్ ఏకంగా శానిటైజర్ నుంచి మద్యం తయారు చేయబోయాడు. శానిటైజర్‌లో అధిక శాతం(72 శాతం) ఆల్కహాల్ ఉండటంతో అతడు ఈ చర్యపు పూనుకున్నాడు.

కాగా.. అతడి ప్రయత్నం గురించి పోలీసులకు తెలియడంతో వారు ఇందర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మధ్యప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. శానిటైజర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో డిస్టిలరీలు మద్యం నుంచి శానిటైజర్ తయారు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!