ప్రధాని మోదీతో ఎంపీ సీఎం కమల్‌నాథ్‌ భేటీ

| Edited By:

Jun 06, 2019 | 7:58 PM

ప్రధాని మోదీతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో దాదాపు అరంగటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. మోదీ వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత కమల్‌నాథ్‌ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర సమస్యలతోపాటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కమల్‌నాథ్‌ […]

ప్రధాని మోదీతో ఎంపీ సీఎం కమల్‌నాథ్‌ భేటీ
Follow us on

ప్రధాని మోదీతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో దాదాపు అరంగటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. మోదీ వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత కమల్‌నాథ్‌ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర సమస్యలతోపాటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కమల్‌నాథ్‌ ప్రధానితో చర్చించినట్లు తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనికి సంబందించి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరినట్లు అందులో పేర్కొంది. కమల్‌నాథ్‌ చర్చించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ప్రకటనలో వెల్లడించింది.