సాధారణంగా సినీ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా చాలా మంది కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు చాలా మంది సెలబ్రెటీలు వాటికి రెస్పాండ్ కారు. తాజాగా హీరో మాధవన్‌ను కూడా ఓ నెటిజన్ కించపరుస్తూ ట్రోల్ చేసింది. నేను మ్యాడీకి పెద్ద అభిమానిని. కానీ అతడు మద్యంకు బానిసై, డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తన కెరీర్‌ను, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నాను. రెహ్నా హై తేరా దిల్ మే.. సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడెలా తయారయ్యాడు? అసలు అతడు ఎం చేస్తున్నాడో అతడి ముఖం చూస్తేనే తెలుస్తోంది అంటూ రాసుకోచ్చింది.
ఆ ట్వీట్ చూసిన మాధవన్ వెంటనే కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. “ఓహో.. ఇదా మీరు చేసేది? పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు తొందరగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిది” అంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. మాధవన్‍కు మద్ధతుగా అతని అభిమానులు కూడా ఆ నెటిజన్‌కు కౌంటర్లిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకున్నారని అందుకు మా హీరోని కూడా అనుమానిస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మీ చూపు గురించి ఒకసారి చెక్ చేయించుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ మారా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 8న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ సినిమాలో నటిస్తున్నాడు.
మాధవన్ ట్వీట్..
Oh .. So that’s your diagnoses ? I am worried for YOUR patients. ????. May be you need a Docs appointment. . https://t.co/YV7dNxxtew
— Ranganathan Madhavan (@ActorMadhavan) January 5, 2021
Also Read:
డిఫరెంట్ గెటప్స్ లో స్టైలిష్ యాక్టర్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోలు..