రౌడీ బేబి గీతం యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. బిలియన్ వ్యూస్ మార్క్‌ను సోమవారం దాటేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి, చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట అద్భుత రికార్డులను సొంతం చేసుకుంటోంది. యూట్యూబ్ వేదికగా సౌత్ ఇండియా సినిమాకు 100 కోట్ల వ్యూస్ వచ్చినతొలి పాటగా ఘనత సాధించింది.
ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన నటి సాయిపల్లవి.. ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ధన్యావాదాలు తెలిపారు. ‘మారి 2’కు యువన్ శంకర్ రాజా సంగీతమందించగా, బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. రౌడీ బేబీ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.