MAA Elections Counting: విష్ణు ప్యానల్ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ, జనరల్ సెక్రటరీగా రఘుబాబు విజయం

|

Oct 10, 2021 | 8:23 PM

మా ఎన్నికల ఫలితాలు ఫలితాలకు సంబంధించి తొలి ఫలితం వచ్చింది.

MAA Elections Counting: విష్ణు ప్యానల్ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ, జనరల్ సెక్రటరీగా రఘుబాబు విజయం
Maa Elections 2021
Follow us on

‘మా’ ఎన్నికల ఫలితాలు ఫలితాలకు సంబంధించి తొలి ఫలితం వచ్చింది. శివారెడ్డి ప్యానల్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శివారెడ్డి, కౌశిక్ గెలుపొందారు. దీంతో కౌంటింగ్ కేంద్రం బయటకు వచ్చిన శివారెడ్డి ఆనందంలో హావభావాలు చూపించారు. సంపూర్ణేశ్ బాబుపై పోటీ చేసిన శివా రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన సురేష్ కొండేటి కూడా విజయం సాధించారు. ప్రకాశ్ ప్యానల్‌కే చెందిన అనసూయ విజయభేరి మోగించారు. ఇక ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు టెన్షన్‌లో అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నారు. మరో నలుగురు ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన  10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ట్రెజరర్‌గా విష్ణు ప్యానల్‌ను నుంచి బరిలోకి దిగిన నాగినీడుపై విజయం సాధించారు. మంచు విష్ణు  ప్యానల్‌ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు.. జీవితపై విజయం సాధించారు.