తల్లి.. సోదరుడ్ని చంపేసిన బాలిక

మానసిక పరిస్థితి సరిగా లేని ఓ బాలిక సొంత తల్లిని, సోదరుడ్నిపొట్టనబెట్టుకుంది. తుపాకీతో కాల్చి చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లక్నోలోని గౌతమ్‌పల్లి కాలనీకి చెందిన..

తల్లి.. సోదరుడ్ని చంపేసిన బాలిక

Updated on: Aug 29, 2020 | 9:33 PM

మానసిక పరిస్థితి సరిగా లేని ఓ బాలిక సొంత తల్లిని, సోదరుడ్నిపొట్టనబెట్టుకుంది. తుపాకీతో కాల్చి చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లక్నోలోని గౌతమ్‌పల్లి కాలనీకి చెందిన ఈ బాలిక పదవ తరగతి చదువుతోంది. కొంతకాలం క్రితం జాతీయ స్థాయి షూటింగ్‌లో పాల్గొన్న సదరు బాలిక మానసిక పరిస్థితి ప్రస్తుతం బాగుండటం లేదు. ఈ నేపథ్యంలో శనివారం షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసే తుపాకితో తల్లి, సోదరుడిపై కాల్పులు జరిపింది. అనంతరం బ్లేడుతో కోసుకుని చనిపోవాలని ప్రయత్నించింది. బాలిక చేతిలో కాల్పులకు గురైన తల్లి, సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని బాలికను అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించి, పని మనిషిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.