మొబైల్ పోయిందా… వెంటనే బ్లాక్ చేయచ్చు.. ఎలా?

మొబైల్ పోయిందా... వెంటనే బ్లాక్ చేయచ్చు.. ఎలా?

అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ బుకింగ్, ఫుడ్, డ్రెస్సులు కొనడం, దైనందిన అవసరాల కోసం దాని మీద ఆధారపడక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అందరికి ఫోన్ చాలా ముఖ్యమైన పరికరం. అలాంటి ఫోన్ చోరీకి గురైతే పరిస్థితి ఏంటి.? మొత్తం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలా జరగకుండా మొబైల్ చోరీకి గురైన వెంటనే బ్లాక్ చేసేందుకు వీలు ఉండేలా ఓ సిస్టం‌ను కేంద్ర ప్రభుత్వం […]

Ravi Kiran

|

Sep 16, 2019 | 10:24 AM

అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ బుకింగ్, ఫుడ్, డ్రెస్సులు కొనడం, దైనందిన అవసరాల కోసం దాని మీద ఆధారపడక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అందరికి ఫోన్ చాలా ముఖ్యమైన పరికరం. అలాంటి ఫోన్ చోరీకి గురైతే పరిస్థితి ఏంటి.? మొత్తం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలా జరగకుండా మొబైల్ చోరీకి గురైన వెంటనే బ్లాక్ చేసేందుకు వీలు ఉండేలా ఓ సిస్టం‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొబైల్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త అందిస్తూ.. కోల్పోయిన వారు ఫోన్‌ను గుర్తించడానికి లేదా ఫోన్ బ్లాక్ చేయడానికి వీలు కల్పించేలా  సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మొబైల్ పరికరాలను గుర్తించే 15 అంకెల ఐఎమ్ఈఐ నంబర్ల డేటాబేస్‌ రూపొందుతుంది. ఆ నెంబర్ ఆధారంగా బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ ప్రయోగాత్మక సర్వీసుల వెబ్ పోర్టల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఇక భారతదేశంలో బిలియన్‌కు పైగా వైర్‌లెస్ సబ్‌స్క్ర‌యిబ‌ర్లు ఉన్నారని.. ఫోన్లు చోరీకి గురైనప్పుడు ఈ వెబ్ పోర్టల్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఈ సిస్టమ్ పని చేసే విధానం…

మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైనప్పుడు.. లేదా పోయినప్పుడు, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి హెల్ప్‌లైన్ నెంబర్ 14422 ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డీఓటీ)కి తెలియజేయాలి. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన తరువాత, డిఓటి ఐఎమ్ఈఐ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్ చేస్తుంది. దీనితో ఆ మొబైల్‌ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడం కుదరదు. భవిష్యత్తులో దీన్ని ఉప‌యోగించ‌డం కుద‌ర‌దు. అదే ఈఎమ్ఈఐ నెంబర్ ద్వారా, సెల్యులార్ ఆపరేటర్ ఫోన్ కు నెట్‌వర్క్ అంద‌కుండా నిరోధించగలరు. పోర్టల్ ప్రారంభించిన తరువాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇత‌ర‌ ఐఎమ్ఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్‌సెట్‌లను గుర్తించడానికి అనుమతిస్తుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu