AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12ఏళ్ల క్రితం పోయిన బిట్‌కాయిన్‌ మళ్లీ చేతికి.. రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!

12 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌పై ఆశ వదులుకున్నాడు. అదే బిట్‌కాయిన్ తనను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేస్తుందని అతను ఎప్పుడూ ఊహించి ఉండడు. కానీ, అతని భార్య ఇచ్చిన సలహా అతని తలరాతను మార్చేసింది. కేవలం ఆ కొద్ది డబ్బుతోనే అతను $2400 (సుమారు రూ. 1.10 లక్షలు) బిట్‌కాయిన్‌పై ఖర్చు చేశాడు. ఇప్పుడు అతను సొంత ఇంటి కోసం ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ తర్వాత, అతను తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి ఒక పెద్ద పార్టీ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

12ఏళ్ల క్రితం పోయిన బిట్‌కాయిన్‌ మళ్లీ చేతికి.. రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
British Man Bitcoin
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2026 | 9:02 AM

Share

క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన క్రిస్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఒక సినీ ఫాంటసీని తలపిస్తోంది. 12 ఏళ్ల క్రితం శాశ్వతంగా పోయాయనుకున్న బిట్‌కాయిన్లు అనూహ్యంగా అతని చేతికి చిక్కడంతో అతను రాత్రికి రాత్రే ఏకంగా రూ. 36 కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు.

సంవత్సరం 2011లో క్రిప్టోకరెన్సీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న రోజుల్లో తన స్నేహితుడి సలహాతో క్రిస్ UKకి చెందిన ఇంటర్‌సాంగో అనే ప్రారంభ క్రిప్టో ఎక్స్ఛేంజ్ ద్వారా సుమారు £1,500 పెట్టుబడి పెట్టి 61 బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేశాడు. అయితే 2014 నాటికి ఆ ఎక్స్ఛేంజ్ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుని నిలిచిపోయింది. క్రిస్ తన డబ్బును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ, అతని ఖాతా ఫ్రీజ్ అయిపోయింది. ఆ కంపెనీకి తగిన రెగ్యులేటరీ గుర్తింపు లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.

కాలం గడిచేకొద్దీ బిట్‌కాయిన్ విలువ వేగంగా పెరగడం ప్రారంభించింది. ఓ వైపు బిట్‌కాయిన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు తన కళ్లముందే ఉన్న ఆస్తిని అందుకోలేక క్రిస్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 2018లో ఎక్స్ఛేంజ్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చినప్పటికీ, దానిని ఫ్రాడ్ భావించి నిర్లక్ష్యం చేశాడు.

ఇవి కూడా చదవండి

12 ఏళ్ల విసుగు, నిరాశ తర్వాత అతని భార్య ఇచ్చిన సలహా అతని తలరాతను మార్చేసింది. కోల్పోయిన క్రిప్టోను రికవరీ చేసే నిపుణులైన CEL Solicitors అనే లా ఫర్మ్‌ను సంప్రదించమని ఆమె సూచించింది. చట్టపరమైన పరిశోధనలు, బ్లాక్‌చైన్ ట్రేసింగ్ ఆధారంగా ఆ నిపుణుల బృందం చట్టపోరాటం చేసి మే 2026 నాటికి తిరిగి 61 బిట్‌కాయిన్‌ల ప్రాప్యతను క్రిస్‌కు అందించగలిగారు.

నాడు £1,500 మాత్రమే ఉన్న ఆ డిజిటల్ కరెన్సీ విలువ నేడు రూ. 36 కోట్లకు చేరింది. దక్కిన ఈ భారీ మొత్తంతో తన అత్తగారికి సౌకర్యంగా ఉండేలా పెద్ద ఇంటిని కొనుగోలు చేస్తానని, మిగిలిన మొత్తాన్ని మళ్లీ బిట్‌కాయిన్‌లోనే పెట్టుబడిగా ఉంచుతానని క్రిస్ తెలిపాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us