AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు..

బెట్టింగ్ వ్యవసం ఓ యువకుడిని దొంగగా మార్చింది. ఏంబీఏ చదివి మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఉద్యోగం చేస్తే బెట్టింగ్‌కు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో లక్షలు పొగోట్టుకున్నాడు. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు దొంగగా అవతారమెత్తాడు. చివరికి పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు..
Marketing
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 8:27 AM

Share

మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్‌.. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాడు. మంచి ఉద్యోగం.. మంచి ఆదాయం.. ఎన్నో ఆశలతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మొదట సరదాగా మొదలైన ఆన్‌లైన్ బెట్టింగ్ క్రమంగా అలవాటుగా మారింది. గెలుపు కోసం మళ్లీ మళ్లీ డబ్బులు పెట్టాడు. అలా రూ.60 లక్షల వరకు నష్టపోయాడు. డబ్బు పోయింది.. నష్టాలు పెరిగాయి.. చివరకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓడిన కొద్దీ తిరిగి గెలిచి నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచన పెరిగింది. డబ్బు అవసరం పెరగడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనాలు చేసేవాడు. అయితే అక్కడితో ఆగలేదు.. దొంగతనాల్లో వచ్చిన డబ్బును కూడా తిరిగి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టాడు. అతడి జీవితంలోకి వచ్చిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ అన్నింటినీ తలకిందులు చేసింది.

ఒక్కటి కాదు.. రెండు కాదు.. రాము ఇప్పటివరకు తొమ్మిది దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు రాముని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 16 తులాల బంగారు ఆభరణాలు,16 తులాల వెండి వస్తువులు, రూ.2.50 లక్షల నగదు, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అతడి చేతిలో గేమ్‌గా మొదలై.. చివరకు అతడి జీవితాన్నే గేమ్ ఓడించింది. చదువు ఉన్నా.. ఉద్యోగం ఉన్నా.. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు ఉన్నా.. ఒక్క వ్యసనం జీవితాన్ని ఎంతలా నాశనం చేయగలదో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Follow Us
ఆ షూటింగ్ లో గొడవ.. తరుణ్ సినిమా మధ్యలోనే ఆపేశా..!
ఆ షూటింగ్ లో గొడవ.. తరుణ్ సినిమా మధ్యలోనే ఆపేశా..!
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే