భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. మరోపక్క కరోనా లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ లక్షణాలున్నా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇలా ఉండగా.. జలుబు, దగ్గు కాకుండా వేరే లక్షణాలతో కూడా కరోనా బారిన పడుతున్నట్టు తన పరిశోధనలో తెలిసిందని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. వాసన చూసే స్వభావాన్ని కోల్పోవడం. ముఖ్యంగా యువత.. ఉన్నట్టుండి వాసన చూసే స్వభావాన్ని కోల్పోయినట్టయితే.. అది కరోనా పాజిటివ్ లక్షణం కావచ్చని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, బ్రిటిష్ డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, దగ్గు లేకపోయినప్పటికి.. ఈ లక్షణం ఉన్నట్టయితే కరోనా సోకినట్టు భావించవచ్చని అన్నారు. కరోనా బారిన పడిన బాధితుల్లో కొంతమంది రుచిని చూసే స్వభావం కోల్పోవడం కూడా గమనించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాసన చూసే స్వభావాన్ని కూడా కరోనా లక్షణాల జాబితాలోకి చేర్చాలని యూకేలోని ఈఎన్‌టీ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.