భలే విచిత్రం!..మెక్కజొన్న కంకిలో వినాయకుడి రూపం

|

Sep 02, 2019 | 9:13 AM

మొక్కజొన్న తోటలో ఓ కంకి వినాయక ప్రతిమను పోలిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో వెలుగు చూసింది. అక్కడ నివశించే రామారావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి కొద్దిపాటి పెరట్లో మొక్క జొన్న పంట వేసుకున్నాడు. వినాయక చవితి సమీపిస్తుండడంతో పూజల నిమిత్తం మొక్కజొన్నలు కోసుకున్నాడు. వినాయక ప్రతిమ రూపంలో మొక్క జొన్న కంకి ప్రత్యక్షం అవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సాక్షాత్తు వినాయకుడి తమను అనుగ్రహించినట్లు చెబుతున్నాడు. సమీప గుడిలో ఉంచి తొమ్మిది రోజులు పూజలు చేస్తానని.. […]

భలే విచిత్రం!..మెక్కజొన్న కంకిలో వినాయకుడి రూపం
Lord Vinayaka like symbol appears in corn, stuns people in Visaka Paderu
Follow us on

మొక్కజొన్న తోటలో ఓ కంకి వినాయక ప్రతిమను పోలిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో వెలుగు చూసింది. అక్కడ నివశించే రామారావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి కొద్దిపాటి పెరట్లో మొక్క జొన్న పంట వేసుకున్నాడు. వినాయక చవితి సమీపిస్తుండడంతో పూజల నిమిత్తం మొక్కజొన్నలు కోసుకున్నాడు. వినాయక ప్రతిమ రూపంలో మొక్క జొన్న కంకి ప్రత్యక్షం అవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సాక్షాత్తు వినాయకుడి తమను అనుగ్రహించినట్లు చెబుతున్నాడు. సమీప గుడిలో ఉంచి తొమ్మిది రోజులు పూజలు చేస్తానని.. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు రామారావు తెలిపాడు.