AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : కోవిడ్-19‌ సోకి లోక్‌పాల్ సభ్యుడి మృతి

మ‌హ‌మ్మారి క‌రోనావైరస్ ప్రాణాల‌ను తీస్తూ వీర‌విహారం చేస్తోంది. తాజాగా ఈ వైర‌స్ బారిన పడిన లోక్‌పాల్ సభ్యుడు అజయ్ కుమార్ త్రిపాఠి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మ‌ర‌ణించారు. ఎయిమ్స్‌లో  ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ప్రాణాలు‌ విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన మ‌ర‌ణించారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయనకు కోవిడ్-19 సోకినట్టు తేల‌డంతో ఢిల్లీ ఎయిమ్స్‌కి త‌ర‌లించారు. అనంతరం ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ కి మార్చి ట్రీట్మెంంట్ అందించారు. […]

Breaking : కోవిడ్-19‌ సోకి లోక్‌పాల్ సభ్యుడి మృతి
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 03, 2020 | 8:43 AM

Share

మ‌హ‌మ్మారి క‌రోనావైరస్ ప్రాణాల‌ను తీస్తూ వీర‌విహారం చేస్తోంది. తాజాగా ఈ వైర‌స్ బారిన పడిన లోక్‌పాల్ సభ్యుడు అజయ్ కుమార్ త్రిపాఠి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మ‌ర‌ణించారు. ఎయిమ్స్‌లో  ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ప్రాణాలు‌ విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన మ‌ర‌ణించారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయనకు కోవిడ్-19 సోకినట్టు తేల‌డంతో ఢిల్లీ ఎయిమ్స్‌కి త‌ర‌లించారు. అనంతరం ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ కి మార్చి ట్రీట్మెంంట్ అందించారు. త్రిపాఠిని ట్రామా కేర్ సెంటర్‌కు సైతం తరలించారు. ఇక్కడ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తారు. కానీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌ను ఇటీవలే కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్చారు. ఇందులోకి మార్చిన తొలి వ్యక్తి త్రిపాఠినే కావడం గమనార్హం.

త్రిపాఠి 1957 నవంబర్ 12న జన్మించారు. మొద‌ట్నుంచి చ‌దువుపై ఎక్కువ ఇంట్ర‌స్ట్ ఉన్న ఆయ‌న‌ ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనమిక్స్ చదివారు. ఆపై ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి నుంచి లా పట్టా పొందారు. 1981లో పాట్నా హైకోర్టులో లాయ‌ర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. త‌ద‌నంత‌రం బిహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా పని చేసిన ఏకే త్రిపాఠి.. పాట్నా హైకోర్టు అడిషనల్ జడ్జిగానూ సేవలు అందించారు. 2018లో జులైలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. అనంతరం అవినీతి వ్యతిరేక స్వతంత్ర సంస్థ… ‘లోక్‌పాల్’లోని నలుగురు జ్యుడీషియల్ మెంబ‌ర్స్ లో ఒకరిగా.. 2019 మార్చి 23న నియమితులయ్యారు.

Follow Us
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ