Lockdown In UP : దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ క్రమంలో యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 13 ఉదయం 5 గంటల వరకు.. 55 గంటలు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఛీఫ్ సెక్రెటరీ ఆదేశించారు. అయితే.. రైళ్లు, విమాన సర్వీసులు యధావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. కాగా యూపీలో కరోనా కేసుల సంఖ్య 31,156 గా ఉంది.
Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..