ఐపీఎల్ ఫైన‌ల్ కూ ద‌క్క‌ని రేటింగ్.. మోదీ ‘లాక్​డౌన్​ స్పీచ్’కి సొంతం..

|

Mar 27, 2020 | 7:48 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటిక‌ల్ పంచ్ డైలాగ్స్ తో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు జనాదార‌ణ ఓ రేంజ్ లో ఉంటుంది. గ‌తంలో కూడా టీవీ రేటింగ్స్ ప‌రంగా ఆయ‌న స్పీచ్ లు రికార్డు క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ నెల 24న ప్ర‌ధాని చేసిన‌ దేశ‌వ్యాప్త‌ లాక్​డౌన్​ ప్రకటన మాత్రం టీవీ రేటింగ్స్ లో హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్​ […]

ఐపీఎల్ ఫైన‌ల్ కూ ద‌క్క‌ని రేటింగ్.. మోదీ లాక్​డౌన్​ స్పీచ్కి సొంతం..
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటిక‌ల్ పంచ్ డైలాగ్స్ తో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు జనాదార‌ణ ఓ రేంజ్ లో ఉంటుంది. గ‌తంలో కూడా టీవీ రేటింగ్స్ ప‌రంగా ఆయ‌న స్పీచ్ లు రికార్డు క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.

కానీ, ఈ నెల 24న ప్ర‌ధాని చేసిన‌ దేశ‌వ్యాప్త‌ లాక్​డౌన్​ ప్రకటన మాత్రం టీవీ రేటింగ్స్ లో హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్​ క్రికెట్​ మ్యాచ్​కూ రాని రేటింగ్…​ మోదీ జాతినుద్దేశించి చేసిన స్పీచ్ కు వచ్చిందని బ్రాడ్​కాస్టింగ్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్)​ ప్రకటించింది. కరోనాను తుద‌ముట్టించేందుకు సోష‌ల్ డిస్టెన్స్ పాటించడమే ఏకైక మార్గమని నిర్దేశిస్తూ 21 రోజులు నిర్విరామ‌ లాక్​డౌన్​ ప్రకటించారు మోదీ. ఆ స‌మ‌యంలో దాదాపు 19.7 కోట్ల మంది టీవీల్లో ప్ర‌ధాని ప్రసంగాన్ని వీక్షించారు. 201 ఛానళ్లకుపైగా ఈ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన‌ట్టు బార్క్ వెల్లడించింది. కాగా గ‌త ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ను 13.3 కోట్ల ప్ర‌జ‌లు వీక్షించారు. జనతా కర్ఫ్యూపై ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా మోదీ ప్రసంగం వ్యూయర్​షిప్​ 8.3 కోట్లు. పోయిన ఏడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు సంద‌ర్బంగా ప్ర‌ధాని ప్ర‌సంగాన్ని 6.5 కోట్ల మంది చూశారు. 2016లో నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌ను 5.7 కోట్ల మంది చూశారు. ప్ర‌స్తుత లాక్​డౌన్​ ప్రసంగం గ‌త‌ రికార్డులను బద్దలుగొట్టింది.