AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్:

గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు. సీఎం హోదాలో కేసీఆర్ ఆరోసారి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే.. పలు సాంస్కృతిక […]

సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్:
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 12:15 PM

Share

గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు. సీఎం హోదాలో కేసీఆర్ ఆరోసారి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే.. పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రాభివృద్ధిని సూచించే వివిధ శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థికవృద్ధి పురోగతిలో ఉందన్నారు. 2018-19 14.84 వృద్ధిరేటుతో ముందు వరుసలో ఉందన్నారు. పలు సమస్యలకు పరిష్కారం చూపగలిగామన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్దికి చట్టపరమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గిరిజన తండాలు, మారుమూల గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు.

రాబోయే తరానికి ఆస్తిపాస్తులు సరిపోవని.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన కర్తవ్యమనని అన్నారు. కాగా.. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

మొయిన్ హైలెట్స్:

1. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు 2. ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా కొత్త రెవెన్యూ చట్టం 3. సమగ్ర చెత్త నిర్మూలనకు నడుం కట్టాలి 4. రాబోయే తరానికి ఆకు పచ్చ తెలంగాణ అందించాలి 5. పంచాయతీ శాఖను బలోపేతం చేస్తాం 6. రైతులకు రైతుబంధు, బీమా కల్పించాం 7. ప్రపంచంలోనే అద్భుతనిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు 8. సీతారామ, దేవాదుల పథకాల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు 9. పారిశ్రామిక, ఐటీలో ప్రగతి సాధిస్తున్నాం 10. తెలంగాణ ఆర్థిక వృద్ధి పురోగతిలో ఉంది