AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయల్ గ్లో వెనుక అసలు రహస్యం చెప్పిన హైదరాబాద్ బ్యూటీ.. సీరమ్స్, క్రీమ్స్ కాదట..!

ఆమె కళ్లు మాట్లాడతాయి.. ఆమె చిరునవ్వు చందమామలా మెరుస్తుంది. ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో తన నటనతో, హుందాతనంతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెరపై కనిపిస్తే ఒక తెలియని రాజసం కనిపిస్తుంది. అతి దగ్గరగా చూసినా ఆమె చర్మం పసిపాపలా మృదువుగా, మెరుస్తూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.

రాయల్ గ్లో వెనుక అసలు రహస్యం చెప్పిన హైదరాబాద్ బ్యూటీ.. సీరమ్స్, క్రీమ్స్ కాదట..!
Hyderabadi Heroine
Nikhil
|

Updated on: Feb 12, 2026 | 11:00 AM

Share

చాలామంది ఈ మెరుపు వెనుక ఖరీదైన ఫేషియల్స్, లగ్జరీ సీరమ్స్ లేదా సెలబ్రిటీ డెర్మటాలజిస్టులు ఉన్నారని అనుకుంటారు. కానీ ఈ రాజకుమారి అందం వెనుక ఉన్న అసలు రహస్యం ఎక్కడో విదేశాల్లోనో, బ్యూటీ పార్లర్లలోనో లేదు.. అది నేరుగా ఆమె ఇంటి వంటగదిలోనే ఉంది. తన అందానికి వంటగదియే బ్యూటీ షెల్ఫ్ అని చెబుతున్న ఈ భామ.. ముఖానికి వంకాయ తప్ప అన్నీ పూస్తానంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అదితి రావు హైదరి ఫాలో అయ్యే ఆ సింపుల్ కిచెన్ బ్యూటీ ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం..

అమ్మ నేర్పిన పాఠం..

అదితి రావు హైదరి తన చర్మ సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ఇది తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అలవాటు అని వెల్లడించింది. ఆమె దృష్టిలో చర్మ సంరక్షణ అంటే కేవలం పైన రాసుకునేది కాదు, అది శరీరానికి ఇచ్చే పోషణలో ఒక భాగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను నా వంటగదిని నా ముఖంపై పెడతాను. వంటగదిలో నాకు ఏది దొరికినా, బహుశా వంకాయ తప్ప , మిగిలినవన్నీ నా ముఖానికి అప్లై చేస్తాను. నేను ఏది తింటానో, దానిని నా చర్మంపై కూడా ఉపయోగిస్తాను” అని అదితి చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న ట్రెండ్స్ లేదా కొత్త బ్యూటీ రొటీన్ల వెంట పడటం కంటే, మన శరీరానికి, చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడమే ముఖ్యమని నమ్ముతోంది అదితీ.

Aditi Rao Hydari

Aditi Rao Hydari

అదితి తన సహజమైన మెరుపు కోసం వంటగదిలోని కొన్ని సాధారణ వస్తువులను క్రమం తప్పకుండా వాడుతుందట.

  • తేనె: ఇది చర్మంలో తేమను లాక్ చేసి, వెనువెంటనే మృదుత్వాన్ని ఇస్తుంది.
  • పసుపు: చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, ప్రశాంతంగా ఉంచడానికి పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
  • పెరుగు: అలసిపోయిన చర్మాన్ని తాజాగా మార్చడానికి పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • అలోవెరా జెల్: చర్మానికి హైడ్రేషన్ ఇవ్వడానికి, ఆ తాజా మెరుపును అందించడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఓట్స్: పాలు లేదా రోజ్ వాటర్ తో కలిపి ఓట్స్ ఉపయోగిస్తే అది ఒక గొప్ప ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.
  • కొబ్బరి నూనె: పొడి చర్మం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.

సహజత్వానికే ప్రాధాన్యత..

అదితి రావు హైదరి స్టయిల్ ఎప్పుడూ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. మెరిసే జుట్టు, స్వచ్ఛమైన చర్మం ఆమె సొంతం. కేవలం మేకప్ తో అందాన్ని కప్పిపుచ్చడం కంటే, లోపలి నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంపైనే ఆమె దృష్టి పెడుతుంది. చర్మానికి ఏం కావాలో వినడం, దానికి కావలసిన సహజ సిద్ధమైన పోషణను అందించడం వల్ల ఫలితం ఖచ్చితంగా ఉంటుందని ఆమె అభిప్రాయం.

ఈ రోజుల్లో కెమికల్స్ తో కూడిన ప్రొడక్ట్స్ వాడుతున్న చాలామందికి అదితి చెబుతున్న ఈ కిచెన్ టిప్స్ ఒక చక్కని పరిష్కారం అని చెప్పాలి. అతి తక్కువ ఖర్చుతో, వంటగదిలో దొరికే వస్తువులతో అదితి రావు హైదరి లాంటి ‘రాయల్ గ్లో’ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కావలసిందల్లా కొంచెం ఓపిక, సహజ సిద్ధమైన పదార్థాలపై నమ్మకం. ట్రెండ్స్ వెనుక పరిగెత్తడం కంటే, మన అమ్మలు, అమ్మమ్మలు చెప్పిన ఇలాంటి సహజ చిట్కాలు పాటిస్తే చర్మం ఎంతో కాలం ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us