వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్
వర్మ మర్డర్ సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. నల్గొండ జిల్లా కోర్ట్ ఇచ్చిన స్టేని హైకోర్టు కొట్టివేసింది. ప్రణయ్, అమృత, మారుతీ రావు పేర్లు...

వర్మ మర్డర్ సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. నల్గొండ జిల్లా కోర్ట్ ఇచ్చిన స్టేని హైకోర్టు కొట్టివేసింది. ప్రణయ్, అమృత, మారుతీ రావు పేర్లు, ఫొటోలు వాడకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. గతంలో ఈ సినిమాను ఆపాలంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి జూలై 29న నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందు మర్డర్ చిత్ర ప్రొడ్యూసర్లకు సైతం నోటీసులు సైతం జారీ చేసింది కోర్టు. ఈ పిటిషన్‌ను విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ.. గతంలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. తాజాగా హైకోర్టు క్రింది కోర్టు స్టేను ఎత్తివేసింది. ఈ క్రమంలో ఆర్జీవీ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Also Read :
ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం




