లీగల్ సమస్యల వల్లే భారత్ కు విజయ్ మాల్యా అప్పగింతలో జాప్యం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

| Edited By: Anil kumar poka

Jan 18, 2021 | 6:28 PM

బ్రిటన్ నుంచి భారత్ కు బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా అప్పగింతలో జాప్యం జరగడానికి లీగల్ సమస్యలే కారణమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

లీగల్ సమస్యల వల్లే భారత్ కు విజయ్ మాల్యా అప్పగింతలో జాప్యం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
Follow us on

బ్రిటన్ నుంచి భారత్ కు బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా అప్పగింతలో జాప్యం జరగడానికి లీగల్ సమస్యలే కారణమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కోర్టుకు  ఓ లేఖ రాసింది. మాల్యాను సాధ్యమైనంత త్వరగా రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని, కానీ యూకే చట్టాల ప్రకారం ఈ న్యాయ పరమైన సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఆయన అప్పగింత సాధ్యం కాదని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో బ్యాంకులకు 9 వేల కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టి బ్రిటన్ చెక్కేసిన మాల్యా అక్కడ విలాసవంతంగానే గడుపుతున్నారు. కాగా ఈ లీగల్ సమస్యలు ఎప్పుడు, ఎంత కాలానికి పరిష్కారమవుతాయో చెప్పలేమని అక్కడి కోర్టులు తెలిపినట్టు ఈ లేఖ వెల్లడించింది. (తన ఆస్తులను విక్రయించి తన రుణాలన్నీబ్యాంకులు సర్దుబాటు చేసుకోవచ్చునని మాల్యా లండన్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో లోగడ పేర్కొన్నారు.)ఇలా ఉండగా న్యాయమూర్తులు యూ.యూ లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ మార్చి 15 న ఈ కేసుపై తదుపరి విచారణ జరపనుంది.

Read Also:ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్.