Leap Day: ఆశ్చర్యం.. వారి పిల్లలిద్దరూ ఫిబ్రవరి 29నే పుట్టారు!

లీప్ డేలో బిడ్డకు జన్మనివ్వడం చాలా అరుదైన సంఘటన. అయితే ఓ జంట మొదటి బిడ్డనే కాకుండా రెండో బిడ్డను కూడా లీపు సంవత్సరంలో అదే తేదీన జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరో చిత్రం ఏంటంటే

Leap Day: ఆశ్చర్యం.. వారి పిల్లలిద్దరూ ఫిబ్రవరి 29నే పుట్టారు!
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2020 | 10:58 PM

Leap Day: లీప్ డేలో బిడ్డకు జన్మనివ్వడం చాలా అరుదైన సంఘటన. అయితే ఓ జంట మొదటి బిడ్డనే కాకుండా రెండో బిడ్డను కూడా లీపు సంవత్సరంలో అదే తేదీన జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరో చిత్రం ఏంటంటే ఇద్దరు బిడ్డలు కూడా సిజేరియన్‌తో కాకుండా సహజ పద్ధతిలోనే జన్మించారు.

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన లిండ్సే డెమ్చాక్ 2016లో తన కుమారుడు ఒమ్రీకి ఫిబ్రవరి 29న జన్మనిచ్చింది. తాజాగా తన రెండో బిడ్డ స్కౌట్‌కు కూడా 2020 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29నే జన్మనిచ్చింది. అయితే, ఈ రెండు ప్రసవాలు యాదృచ్ఛికంగా చోటుచేసుకున్నవే కావడం గమనార్హం.

అయితే.. చిత్రంగా ఫిబ్రవరి 29 న బ్రూక్లిన్‌లోని కోనీ ఐలాండ్ ఆసుపత్రిలో లిండ్సేఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు చెప్పినట్లుగానే ఒమ్రీ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న జన్మించాడు. అయితే, స్కౌట్ మార్చి 4వ తేదీన పుట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ సందర్భంగా లిండ్సే, ఆమె భర్త.. స్కౌట్ కూడా ఒమ్రీలా ఫిబ్రవరి 29న పుట్టదు కదా అని సరదాగా జోక్ చేసుకున్నారు. అయితే, వారి జోక్ నిజమైంది.

మరోవైపు, 2.1 మిలియన్ మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఇలాంటి అద్భుతం సొంతం అని పేర్కొన్నారు. అయితే, ఏటా వీరి పుట్టిన రోజు కలిపే చేస్తారని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. పెద్దవాడైన ఒమ్రీ ఫిబ్రవరి 28న, స్కౌట్‌కు మార్చి 1న పుట్టిన రోజు జరుపుతారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న ఇద్దరికి కలిపి ధూమ్ ధామ్‌గా పుట్టిన రోజు వేడుకలు జరుపుతారు.

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన