హైదరాబాద్ టూ చెన్నై.. తలా బైక్ రైడింగ్.. హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరికీ తెలిసిన విషయమే. యాక్టర్, ఫోటోగ్రాఫర్, ఫార్ములా వన్ రేసర్, బైక్ రేసర్, ప్రొఫెసర్.. ఇలా ఆయన అన్ని రంగాల్లోనూ ఆరితేరారు. ఇదిలా ఉంటే ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం . గతంలో బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గొప్ప పేరు కూడా సంపాదించారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆయన తాజాగా హైదరాబాద్ నుంచి చెన్నై దాదాపు 650 కిలోమీటర్లు […]

హైదరాబాద్ టూ చెన్నై.. తలా బైక్ రైడింగ్.. హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

Updated on: Apr 21, 2020 | 2:06 PM

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరికీ తెలిసిన విషయమే. యాక్టర్, ఫోటోగ్రాఫర్, ఫార్ములా వన్ రేసర్, బైక్ రేసర్, ప్రొఫెసర్.. ఇలా ఆయన అన్ని రంగాల్లోనూ ఆరితేరారు. ఇదిలా ఉంటే ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం . గతంలో బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గొప్ప పేరు కూడా సంపాదించారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆయన తాజాగా హైదరాబాద్ నుంచి చెన్నై దాదాపు 650 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం చేశారు. కేవలం ఫుడ్, పెట్రోల్ కోసమే మధ్యలో ఆగారని చిత్ర యూనిట్ చెబుతోంది.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

కొద్దిరోజుల క్రితం ‘వాలిమై’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. అందులో ఓ బైక్ చేజింగ్ సన్నివేశం ఉందట. దాని కోసం ప్రత్యేకంగా బైక్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. అది అజిత్‌కు తెగ నచ్చేసిందట. ఇక సినిమా షెడ్యూల్ పూర్తీ చేసుకుని అందరూ ఇంటికి వెళ్లేందుకు సిద్దమవ్వగా.. అజిత్ తన ఫ్లైట్ టికెట్‌ను క్యాన్సిల్ చేయమని అసిస్టెంట్‌కు చెప్పి జాలీగా బైక్‌పై చెన్నై చేరుకున్నారని సమాచారం. ఈ విషయం తాజాగా బయటికి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అజిత్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ‘తలా’ ఏం చేసినా అందులో ఓ కిక్కు ఉంటుందబ్బా..!

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..