
Latest Crime News: రాజమండ్రిలో ఏబీ అప్పారావు రోడ్డులో శుక్రవారం భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన ఆటో డ్రైవర్ సతీష్, వీర వెంకటలక్ష్మీకి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్దికాలంగా సతీష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దానితో అతడి ఆరోగ్యం బాగా క్షీణించింది.
కాగా, గురువారం అర్ధరాత్రి సతీష్, వెంకటలక్ష్మిలు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజులు ఒంట్లో బాగోలేకపోయేసరి కరోనా వైరస్ ఉందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారిరువురూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనను అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
For More News:
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?
కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?
కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?
కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..