breaking news : నాయిని సతీమణి కన్నుమూత

దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి నాయిని అహల్య (68) అనారోగ్యంతో మృతిచెందారు. నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆమెకూ కరోనా సోకింది.

breaking news : నాయిని సతీమణి కన్నుమూత

Updated on: Oct 26, 2020 | 8:39 PM

Naini Wife Ahalya Passed Away :  దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి నాయిని అహల్య (68) అనారోగ్యంతో మృతిచెందారు. నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆమెకూ కరోనా సోకింది. అయితే ఆ తర్వాత అహల్యకు నెగటివ్‌ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఈరోజు మృతిచెందారు.

నాయిని న‌ర్సింహారెడ్డి స‌తీమ‌ణి గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. భ‌ర్త‌ను క‌డ‌సారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మ‌హాప్ర‌స్థానానికి చేరుకుని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. భ‌ర్త‌ను త‌లుచుకుంటూ ఆమె క‌న్నీరుమున్నీరు అయ్యారు.ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.