AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు: లక్ష్మీ పార్వతి

కోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని చంద్రబాబు గతంలో తనకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని తెలుగు అకాడమీ చైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపేవరకు తాను పోరాడుతూనే ఉంటానని ఆమె అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆమె, ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతానని తెలిపారు. ఒకవేళ అక్కడ కూడా న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఇలాఉండగా, చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని […]

చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు: లక్ష్మీ పార్వతి
Venkata Narayana
|

Updated on: Oct 09, 2020 | 9:05 PM

Share

కోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని చంద్రబాబు గతంలో తనకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని తెలుగు అకాడమీ చైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపేవరకు తాను పోరాడుతూనే ఉంటానని ఆమె అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆమె, ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతానని తెలిపారు. ఒకవేళ అక్కడ కూడా న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఇలాఉండగా, చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.

చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని లక్ష్మీ పార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన చూపిన ఆస్తులు, అనంతరం పెరిగిన ఆస్తులను చూపుతూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ 21కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Follow Us