కరోనా దూరని ‘లక్షదీవులు’..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశమంతా విస్తరించిన వైరస్ ను ఓ చిన్న ప్రాంతం నిలువరించింది. కట్టుదిట్టమైన చర్యలతో, జాగ్రత్తలతో రాకాసిలా

కరోనా దూరని లక్షదీవులు..

Edited By:

Updated on: Jul 17, 2020 | 6:10 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశమంతా విస్తరించిన వైరస్ ను ఓ చిన్న ప్రాంతం నిలువరించింది. కట్టుదిట్టమైన చర్యలతో, జాగ్రత్తలతో రాకాసిలా దూసుకొస్తున్న కరోనాను లక్షదీవులు లోపలికి చొరబడకుండా ఆపేశాయి. లక్షదీవుల ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుందంటే, మహమ్మారిపై పోరులో ఈ కేంద్రపాలిత ప్రాంతం ఎంత ముందుచూపుతో ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా కట్టడికోసం ఎన్నో ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే కరోనా ప్రభావం చూపని ప్రాంతంగా లక్షదీవులు వార్తల్లో నిలిచింది. లక్షదీవుల జనాభా 64,473. కరోనా మహమ్మారిగా మారిందని తెలిసిన నాటి నుంచి సరిహద్దులను మూసేసింది. అనుమానితులను ఎక్కువ రోజులు క్వారంటైన్​లో ఉంచింది. ఐసీఎంఆర్​ సూచనలకు అనుగుణంగా వ్యాధి లక్షణాలు కనిపించిన 61 మందికి టెస్టింగ్​ నిర్వహించింది. వీరందరికీ కరోనా నెగటివ్​ వచ్చిందని లక్షదీవుల హెల్త్ సెక్రటరీ డా.ఎస్​.సుందరవడివేలు వెల్లడించారు.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..