సోషల్ మీడియా మాయ‌లోడు…అత‌డి వ‌ల‌లో 100మంది అమ్మాయిలు

|

Jul 23, 2020 | 4:01 PM

సోష‌ల్ మీడియా మాయ‌గాళ్లు పెరిగిపోతున్నారు. అమ్మాయిలు ల‌క్ష్యంగా చెల‌రేగిపోతున్నారు. బెదిరింపులకు దిగుతూ వారి మాన‌, ప్రాణాల‌తో ఆడుకుంటున్నారు.

సోషల్ మీడియా మాయ‌లోడు...అత‌డి వ‌ల‌లో 100మంది అమ్మాయిలు
Follow us on

సోష‌ల్ మీడియా మాయ‌గాళ్లు పెరిగిపోతున్నారు. అమ్మాయిలు ల‌క్ష్యంగా చెల‌రేగిపోతున్నారు. బెదిరింపులకు దిగుతూ వారి మాన‌, ప్రాణాల‌తో ఆడుకుంటున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ఓ చీట‌ర్ బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. అమ్మాయిలు ఫోటోలే త‌న క్రైమ్ కు పెట్ట‌బ‌డిగా చెల‌రేగిపోయాడు ఈ కేటుగాడు. వారి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో సేక‌రించి, మార్పింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు తెగబడ్డాడు. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు..ఏకంగా 100 మందికి పైగా అమ్మాయిలు ఈ సైబ‌ర్ నేర‌గాడి వ‌ల‌లో ప‌డ్డారు.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలు ఫోటోల‌ను సేక‌రించి, వాటిని మార్పింగ్ చేసిన అనంత‌రం..వాళ్ల నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసేవాడు ఈ కిలాడీ. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కపోతే వాటిని బూతు సైట్ల‌లో పెడతాన‌ని బెదిరించేవాడు. దీంతో భ‌య‌ప‌డ్డ అమ్మాయిలు వాడికి డ‌బ్బు ముట్టజెప్పేవారు. ఇటీవల ఈ చీట‌ర్ వేధింపుల‌పై హైదరాబాద్ కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్ ని అరెస్టు చేశారు. విచార‌ణ‌లో అస‌లు విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. మహమ్మద్ పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ప‌లు కేసులు ఉన్న‌ట్లు గుర్తించారు పోలీసులు. అత‌డి చేతిలో మోసపోయిన అమ్మాయిలు లిస్ట్ చాలా పెద్ద‌ద‌ని తెలిపారు.