కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెల్లో సైతం కరోనా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా కరోనా కేసులతో అల్లాడిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Updated on: Jul 24, 2020 | 9:14 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెల్లో సైతం కరోనా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా కరోనా కేసులతో అల్లాడిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం ఏకంగా 914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లావ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9,615కు చేరింది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 8 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 150 మంది మరణించారు. ఇక ఇవాళ్టి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 5,331 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,134 యాక్టీవ్ కేసులున్నాయి. భారీగా కేసుల నమోదవుతుండడంతో ఎక్కువ శాతం బాధితులను హోం క్వారంటైన్ లో ఉంచుతూ చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.