కర్నూలులో కరోనా మృతదేహాల ఖననం కష్టాలు..

కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వణికిస్తోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయంటే..వైరస్ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్ దెబ్బకు తట్టుకోలేక ఇప్పటికే ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయితే..చనిపోయిన వారిని ఖననం చేసేందుకు మునిసిపల్ సిబ్బంది పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. ఏ స్మశాన వాటికకు తీసుకెళ్ళిన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతంలో ఖననం చేయొద్దంటూ ధర్నాలు,ఆందోళనలు […]

కర్నూలులో కరోనా మృతదేహాల ఖననం కష్టాలు..

Updated on: Apr 21, 2020 | 10:22 PM

కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వణికిస్తోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయంటే..వైరస్ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్ దెబ్బకు తట్టుకోలేక ఇప్పటికే ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయితే..చనిపోయిన వారిని ఖననం చేసేందుకు మునిసిపల్ సిబ్బంది పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. ఏ స్మశాన వాటికకు తీసుకెళ్ళిన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతంలో ఖననం చేయొద్దంటూ ధర్నాలు,ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది. మరోవైపు కరోనాతో చనిపోయిన వారి కోసం ప్రత్యేకంగా బాడీ బర్నింగ్ మిషన్ కోసం ఆర్డర్ ఇచ్చినా అది తయారు చేసేందుకు నెల రోజులు గడువు కోరారు తయారీదారులు. ఈ నేపథ్యంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్థరాత్రి శ్మశాన వాటికకు వెళ్లి మృతదేహాలను ఖననం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. Kovid ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, వైద్యాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు ఒప్పుకోవడంలేదు.