చెల్లెలు కవితకు బర్త్ డే విషస్ తెల్పిన కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ తన సోదరికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా అయిన నా చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ప్రజా సేవలో ఎక్కువకాలం  కొనసాగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. Many many happy returns of […]

చెల్లెలు కవితకు బర్త్ డే విషస్ తెల్పిన కేటీఆర్

Updated on: Mar 13, 2019 | 10:48 AM

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ తన సోదరికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా అయిన నా చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ప్రజా సేవలో ఎక్కువకాలం  కొనసాగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.