కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రికి కేటీఆర్ రిక్వెస్ట్…

|

Jun 06, 2020 | 12:23 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించడ‌మే కాదు..సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందిస్తారు. దీంతో చాలామంది ఏమైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే..హెల్ప్ చేయాల్సిందిక‌గా కేటీఆర్ ను సోష‌ల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.

కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రికి కేటీఆర్ రిక్వెస్ట్...
Follow us on

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించడ‌మే కాదు..సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందిస్తారు. దీంతో చాలామంది ఏమైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే..హెల్ప్ చేయాల్సింది‌గా కేటీఆర్ ను సోష‌ల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా మస్కట్‌లో ఉన్న తెలంగాణలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన వ్యక్తులు లాక్‌డౌన్‌ కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ట్విట్ట‌ర్ ద్వారా మినిస్ట‌ర్ కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంట‌నే రెస్పాండ్ అయిన కేటీఆర్.. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు ప్ర‌త్యేక‌ విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరిని రిక్వెస్ట్ చేశారు. మ‌న సాటి భార‌తీయులు చాలామంది మ‌స్క‌ట్ లో జీతాలు లేక, తినేందుకు ఫుడ్ లేక అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్నార‌ని.. వారిని మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు విమానం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

కాగా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న ఇండియ‌న్స్ ను ‘వందేభారత్’‌ మిషన్‌లో భాగంగా కేంద్రం స్వ‌దేశానికి తిరిగి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.