వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పిన కేటీఆర్.. వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజూ తాగు నీటి సరఫరా.

గ్రేటర్ వరంగల్ ప్రజలకు రాష్ట్ర పురపాలక మంత్రి కే. తారకరామారావు శుభవార్త చెప్పారు. వరంగల్ కార్పొరేషన్‌లో.. ప్రతిరోజు తాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.

వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పిన కేటీఆర్.. వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజూ తాగు నీటి సరఫరా.

Updated on: Dec 21, 2020 | 6:55 PM

ktr good news to warangal people: గ్రేటర్ వరంగల్ ప్రజలకు రాష్ట్ర పురపాలక మంత్రి కే. తారకరామారావు శుభవార్త చెప్పారు. వరంగల్ కార్పొరేషన్‌లో.. ప్రతిరోజు తాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఉగాది నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలతో తాజాగా హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో భాగంగా వరంగల్‌లో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇక వరంగల్ నగరంలో అందరికీ ప్రతిరోజు తాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి కావాల్సిన మౌలిక అవసరాలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. అంతేకాకుండా వరంగల్‌లో తాగు నీటి సరఫరాను మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.